పంజాబ్ లో కాల్వలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి

పంజాబ్ లో కాల్వలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి

పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముక్తసర్ జిల్లా సిర్హింద్ వద్ద ప్రైవేట్ బస్సు కాల్వలో పడి ఐదుగురు మృతిచెందారు. వర్షం కురుస్తుండటంతో బస్సు స్కిడ్ కావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.  

ముక్తసార్ నుంచి కోట్కాపూర్ వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న కారును తప్పించే క్రమంలో స్కిడ్ అయి కాల్వలో పడటంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో  బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. మృతదేహాలను కాల్వలోనుంచి బయటికి తీసినట్లు తెలిపారు