ఎన్నికల వేళ సీఎంకు షాక్.. బంధువుల ఇంటిపై ఈడీ దాడులు

ఎన్నికల వేళ సీఎంకు షాక్.. బంధువుల ఇంటిపై ఈడీ దాడులు

ఎన్నికల వేళ పంజాబ్ ముఖ్యమంత్రికి భారీ షాక్ తగిలింది. వచ్చేనెలలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ మరదలి కుమారుడు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. పంజాబ్‌లో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. ఇసుక మాఫియా భూపీందర్ సింగ్ హనీకి సంబంధించిన స్థలాల్లో ఈడీ సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం నుంచే భుపేందర్ సింగ్ ఇంటితో పాటు.. పంజాబ్ లోని మరో పది ప్రాంతాల్లో చోట్ల జోరుగా సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. 

మరికొన్ని రోజుల్లో పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చేనెల 20వ తేదిన పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.  వివిధ రాజకీయ పార్టీల నుంచి విజ్ఞప్తులు రావడంతో.. ఫిబ్రవరి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20వ తేదీన నిర్వహించాలని నిర్ణయించినట్టు ఈసీ సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయడానికి ప్రధాన కారణం .. రవిదాస్‌ జయంతి. వచ్చేనెల 1 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 10న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. 

ఇవి కూడా చదవండి: 

రిపబ్లిక్ డే నాడు మోడీని అడ్డుకుంటం

పంజాబ్, గోవా పైనే ఆప్ ఫోకస్