పంజాబ్​ సీఎం భార్యకే టోకరా

పంజాబ్​ సీఎం భార్యకే టోకరా

చండీగఢ్​: ‘ఓటీపీ, పిన్​ ఎవరికీ చెప్పొద్దు. బ్యాంకు వాళ్లు అడిగినా సరే’ అంటూ బ్యాంకులు పదే పదే చెబుతున్నా అలాగే మోసపోతున్నారు చాలా మంది. మామూలు జనమే కాదు, ఆ జనం ఎన్నుకున్న నేతలూ బుక్కవుతున్నారు. అందుకు ఉదాహరణ పంజాబ్​ సీఎం కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ భార్య, పటియాలా ఎంపీ ప్రణీత్​ కౌర్​. జార్ఖండ్​కు చెందిన ఓ సైబర్​ కేటుగాడు బ్యాంక్​ మేనేజర్​నంటూ ఫోన్​ చేసి ఆమె అకౌంట్​ నుంచి ₹23 లక్షలు కొట్టేశాడు. జార్ఖండ్​లోని జామ్​తారా  ప్రాంతం సైబర్​ నేరాలకు హబ్. అక్కడి నుంచే వారం క్రితం అతుల్​ అన్సారీ అనే వ్యక్తి, పార్లమెంట్​ సమావేశాల్లో ఉన్న ప్రణీత్​కు ఫోన్​ చేశాడు. ఎస్బీఐ మేనేజర్​నని నమ్మించాడు. అకౌంట్​లో జీతం పడాల్సి ఉందని, ఏటీఎం పిన్​, ఓటీపీ చెప్పాలని కోరాడు. ఎదురు కూడా ప్రశ్నించకుండా ఆమె వివరాలు చెప్పారు. తర్వాత 3 విడతల్లో అతగాడు ఆమె ఖాతా నుంచి ₹23 లక్షలు డ్రా చేశాడు. దీంతో వెంటనే పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మంగళవారం అన్సారీని అరెస్ట్​ చేశారు.