మోడీ టూర్ భద్రతా వైఫల్యం.. అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు

మోడీ టూర్ భద్రతా వైఫల్యం.. అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు

ప్రధాని మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా ఫిరోజ్ పూర్ లో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలపై విచారణకు చన్నీ సర్కార్ అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జడ్జి మెహతాబ్ సింగ్, ప్రిన్సిపల్ సెక్రటరీ అనురాగ్ శర్మతో కూడిన కమిటీని ప్రకటించింది. మూడు రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని పంజాబ్ సర్కార్ ఆదేశించింది. నిన్న ఫిరోజ్ పూర్ లో మోడీ పర్యటన సందర్భంగా కాన్వాయ్ ని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని.. తర్వాత పర్యటనను రద్దుచేసుకొని వెనుదిరిగారు. దీంతో పంజాబ్ సర్కార్ పై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో పాటు ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యాలపై విచారించాలని సుప్రీంకోర్టులో న్యాయవాది మణిందర్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దురుద్దేశపూర్వకంగానే ప్రధాని పర్యటను అడ్డంకి సృష్టించారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ కాపీలను కేంద్ర, పంజాబ్ పంజాబ్ ప్రభుత్వాలకు పంపాలని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. రేపు కేసును సుప్రీం కోర్టు విచారిస్తుందని ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

కెమికల్ గ్యాస్ లీకై ఆరుగురు మృతి

భారత్ లో కరోనా విజృంభణ.. ఒకే రోజు 90వేల కేసులు