రైతులకు మద్దతుగా డీఐజీ రాజీనామా

రైతులకు మద్దతుగా డీఐజీ రాజీనామా

చండీగఢ్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసనలు 18వ రోజుకు చేరాయి. అన్నదాతలకు విపక్ష పార్టీలతోపాటు ప్రముఖ సెలబ్రిటీలు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో రైతుల నిరసనలకు సపోర్ట్‌‌గా ఓ పోలీసు ఉన్నతాధికారి రాజీనామా చేశారు. పంజాబ్ డిప్యూటీ ఇన్స్‌‌పెక్టర్ జనరల్ (జైళ్ల శాఖ) లక్ష్మీందర్ సింగ్ జఖర్ రైతుల నిరసనలకు మద్దతుగా రిజైన్ చేశారు. తన రాజీనామాను పంజాబ్ ప్రభుత్వానికి శనివారం అందజేశానని సింగ్ తెలిపారు.

‘వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసనలు చేస్తున్న నా రైతాంగ సోదరులకు మద్దతుగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రాజీనామా లేఖలో లక్ష్మీందర్ సింగ్ పేర్కొనడం గమనార్హం. హర్యానా, పంజాబ్‌‌కు చెందిన వేలాది రైతులు ఢిల్లీ బార్డర్ పాయింట్స్‌‌లో నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. అన్నదాతల డిమాండ్లపై రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ అవి సఫలం కాలేదు.