
పంజాబ్ గవర్నర్ జన్వరీలాల్ పురోహిత్.. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి భవన్ కు పంపించారు. అయితే పంజాబ్ గవర్నర్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది.
బన్వరీలాల్ పంజాబ్ గవర్నర్ గా, కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ కు అడ్మినిస్ట్రేటర్ గా కొనసాగుతున్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ నుంచి మూడుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన బన్వరీలాల్.. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలనుంచి తప్పుకున్న బన్వరీలాల్ ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. 20216లో తొలిసారి అసోం గవర్నర్ గా నియమించింది.
2017లో తమళనాడుకు గవర్నర్ గా బదిలీ అయ్యారు. 2021లో పంజాబ్ గవర్నర్ గా నియిమితులయ్యారు. బన్వరీలాల్ గవర్నర్ గా ఉన్నపుడే 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.
అయితే ఎంతో అనుభవం ఉన్న బన్వరీలాల్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. తమ పదవీ కాలం ముగిసేంత వరకు గవర్నర్లెవరూ రాజీనామాలు చేయడం చేయడు. బన్వరీలాల్ విషయంలో ఇది అరుదైనవిషయం.