
న్యూఢిల్లీ: పంజాబ్స్ కింగ్ కోచ్‌గా.. టీమిండియా లెజెండ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పదవీకాలం ముగిసింది. కుంబ్లే కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించకూడదని ఫ్రాంచైజీ గురువారం నిర్ణయించింది. బాలీవుడ్ నటి ప్రీతి జింతా, ఇండస్ట్రియలిస్ట్ మోహిత్ బర్మన్, నెస్ వాడియాతో కూడిన ఓనర్ల బృందం సమష్టిగా నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త కోచ్ కోసం వీలైనంత త్వరగా వేట మొదలుపెట్టనున్నారు. 2020లో పంజాబ్ కోచ్‌గా కుంబ్లే బాధ్యతలు చేపట్టగా 42 మ్యాచ్‌ల్లో 18 విజయాలు, 22 ఓటములు, రెండు డ్రాలు నమోదు చేసింది. అయితే మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా తొలగిస్తారన్న కథనాలను ఫ్రాంచైజీ కొట్టిపారేసింది.