గూగుల్‌‌‌‌ సెర్చ్‌‌‌‌లో గెలిచిన పంజాబ్ కింగ్స్

గూగుల్‌‌‌‌ సెర్చ్‌‌‌‌లో గెలిచిన పంజాబ్ కింగ్స్

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌‌‌‌) 2025  సీజన్‌‌‌‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తొలిసారిగా టైటిల్‌‌‌‌ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. కానీ, విక్టరీ కంటే కూడా డిజిటల్ వరల్డ్‌‌‌‌లో పెద్ద విజయం సాధించిన జట్టు మరొకటి ఉంది.

గూగుల్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌‌‌‌ఫుల్ టీమ్స్‌‌‌‌ సీఎస్కే, ముంబై ఇండియన్స్‌‌‌‌, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆర్సీబీని వెనక్కి నెట్టి పంజాబ్ కింగ్స్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన ఐపీఎల్‌‌‌‌ జట్టుగా నిలిచింది. 

కేవలం ఐపీఎల్‌‌‌‌ జట్లలోనే కాదు, ఫుట్‌‌‌‌బాల్ దిగ్గజాలైన పారిస్ సెయింట్-జర్మైన్, బెన్ఫికా, టొరంటో బ్లూ జేస్ వంటి వరల్డ్ టాప్ స్పోర్ట్స్‌‌‌‌ టీమ్స్ సరసన నిలిచి ఔరా అనిపించింది. గత ఎడిషన్‌‌‌‌ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌‌‌‌గా నిలిచినప్పటికీ సెర్చ్ ఇంజన్లలో మాత్రం పంజాబ్ కింగ్స్  గ్లోబల్ చాంపియన్‌‌‌‌గా నిరూపించుకుంది.

దీనిపై పంజాబ్ కింగ్స్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సౌరభ్ అరోరా సంతోషం వ్యక్తం చేశారు. ‘మా జట్టుతో, మా బ్రాండ్‌‌‌‌తో అభిమానులు ఎంతగానో  కనెక్ట్ అయ్యారని ఈ ర్యాంకింగ్ చూపిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా సెర్చ్ చేసిన జట్లలో ఒకటిగా నిలవడం చాలా గొప్ప విజయం’ అని పేర్కొన్నారు.