
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. ఆదివారం (మే 18) రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ లో భారీ స్కోర్ చేసిన పంజాబ్.. ఆ తర్వాత బౌలింగ్ లో సమిష్టిగా రాణించి 17 పాయింట్లతో దాదాపు ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులకు పరిమితమైంది.
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించింది. అర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ లోనే నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ తో జైశ్వాల్ 22 పరుగులు రాబట్టాడు. జైస్వాల్ కు తోడు 14 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ చెలరేగడంతో పవర్ ప్లే లో శరవేగంగా స్కోర్ ముందుకు కదిలింది. తొలి 6 ఓవర్లలోనే రాజస్థాన్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. పవర్ ప్లే తన ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించి సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే 44 పరుగులు చేసి ఔటయ్యాడు.
24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైశ్వాల్ ఔటయ్యాడు. కాసేపటికే కుదురుకున్నాడనుకున్నా సంజు శాంసన్ 22 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ స్లో అయింది. పరాగ్ 13 పరుగులే చేసి ఔట్ కావడంతో మ్యాచ్ పంజాబ్ వైపు మళ్లింది. ఈ సీజన్ లో పేలవ ఫామ్ లో ఉన్న హెట్ మేయర్ 11 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు. చివర్లో ధృవ్ జురెల్, హాఫ్ సెంచరీ పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పంజాబ్ బౌలర్లలో హరిప్రీత్ బ్రార్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఓమర్జాయ్, మార్కో జాన్సెన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహాల్ వధేరా(37 బంతుల్లో 70:5 ఫోర్లు,5సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్ కు తోడు శశాంక్ సింగ్(30 బంతుల్లో 59:5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు పంజాబ్ ఇన్నింగ్స్ లో హైలెట్ గా నిలిచాయి. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే రెండు.. మఫాకా, పరాగ్, ఆకాష్ మాద్వాల్ తలో వికెట్ తీసుకున్నారు.
One foot in the Playoffs for PBKS 👏#RRvPBKS SCORECARD 👉 https://t.co/gqu845TOSE pic.twitter.com/bgx6d4Jcqv
— ESPNcricinfo (@ESPNcricinfo) May 18, 2025