పంజాబ్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

పంజాబ్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

పంజాబ్: సినీ ఫక్కీలో డ్రగ్స్ ముఠాను పంజాబ్ పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. వారి నుంచి 10 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసున్నారు. ఈ ఘటన పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ లో జరిగింది. ఛేజింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీలో లాగా చేజింగ్ వీడియోలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఫిరోజ్ పూర్ లోని చెక్ పోస్టు దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి ఆగకుండా వైట్ కలర్ డిజైర్ కారు ముందుకు వెళ్లింది. ఆ కారుని మరో కారుతో పోలీసులు చేజ్ చేశారు.

ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ స్కూటీ, బైక్ ని ఢీకొనడంతో... మహిళతో సహా ముగ్గురికి గాయాలయ్యాయి. జంక్షన్ దగ్గర మరో కారులో నుంచి పోలీస్ దిగి నిందితులను గన్ తో బెదిరించారు. అయినప్పటికీ ఆగకపోవడంతో.. టైర్లపై కాల్పులు జరిపారు. అయినా ఆగకుండా కారులో పరారయ్యారు నిందితులు. ఎట్టకేలకు 10 కిలో మీటర్లు చేజ్ చేసి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.