అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ 

అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ 

ఖలిస్థానీ వేర్పాటునేత అమృత్‌పాల్‌ సింగ్‌ కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్నారు. జలంధర్లో టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇంటర్నేట్ సేవలను కూడా నిలిపివేశారు.  నిన్న  పోలీసులు ఆరెస్ట్ చేస్తుండగా అమృత్‌పాల్‌ సింగ్‌  పరారయ్యాడు. అతనికి సంబంధించిన 7 అనుచరులను పోలీసులు ఆరెస్ట్ చేసి బియాస్  కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అమృత్‌పాల్‌ సింగ్‌ కు సంబంధించిన  రెండు కార్లను సీజ్ చేసినట్లుగా జలంధర్ డీఐజీ ప్రకటించారు.

వాహనాలలో రెండు మరణ ఆయుధాలు  ఉన్నట్లుగా గుర్తించామన్నారు. దుండగులకు పాకిస్థాన్ ఐఎస్ఐతో లింకులు ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఇటు గురుదాస్ పూర్, లథియానాలో పోలీసులు ప్లాగ్ మార్చ్ లు  నిర్వహిస్తున్నారు. జలంధర్ లో ఇంటర్నేట్ బంద్  సేవలు రేపటివరకు కొనసాగనున్నాయని పోలీసులు ప్రకటించారు.