రూ.500పెట్టుబడితో రూ.2.5కోట్ల జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రిక్షావాలా

రూ.500పెట్టుబడితో రూ.2.5కోట్ల జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన రిక్షావాలా

లాటరీ అనేది కొన్ని శతాబ్దాలుగా సాగుతున్న ఓ వేట లాంటిది. కొంతమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందు రాత్రి సమయమే అనువైనదిగా భావిస్తారు. ఇది ఒక గేమ్ లాంటిదే అయినా.. కొందరు లక్షల్లో గెలుస్తారు, మరికొందరు తమ డబ్బును కోల్పోతారు కూడా. అలా ఓ వ్యక్తి చాలా సార్లు తన డబ్బును కోల్పోయినా.. తిరిగి ప్రయత్నించేవాడు. చివరకి కోట్ల రూపాయలు గెలుచుకుని సంచలనంగా మారాడు.

లాటరీ విజయ గాథ

పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన 90 ఏళ్ల రిక్షా డ్రైవర్ స్టోరీ హృదయాన్ని కదిలిస్తోంది. రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని పోషించే గురుదేవ్ సింగ్.. ఆ ప్రాంతంలో అత్యంత పాపులర్ అయిన లాటరీ గేమ్ లో రూ.500 పెట్టుబడి పెట్టుబడి పెట్టారు. ఈ లాటరీలో అతను రూ.2.5 కోట్లు గెలవడంతో అతని జీవితమే మారిపోయింది.

గురుదేవ్ సింగ్ లాటరీ ప్రయాణం:

గురుదేవ్ సింగ్ చాలా కాలంగా లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేస్తున్నాడు. ఏదో ఒక రోజు లాటరీ కొట్టాలనే ఆశతో, పట్టుదలతో ఉండేవాడు. కానీ ఇంత పెద్ద మొత్తంతో గెలుస్తానని అతను ఊహించలేకపోయాడు. రూ.2.5కోట్ల విలువైన లాటరీ తగిలిందన్న వార్త తెలియగానే అతను నమ్మలేకపోయాడు. చాలా కాలంగా బతుకుదెరువు కోసం కష్టాలు పడుతున్న తనకు, కుటుంబానికి ఈ లాటరీతో కల సాకారమైనందుకు అమితానందంతో పొంగిపోయాడు.

సంవత్సరాల ఫలితం:

గురుదేవ్ సింగ్ తన లాటరీ విజయానికి తన 40 సంవత్సరాల సమాజ సేవే కారణమని చెప్పాడు. రోడ్లపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చి రోడ్డుపక్కన ఉన్న చెట్లకు, మొక్కలకు నీళ్లు పోసేవాడు. తాను చేసిన మంచి పనులకు చివరకు మంచి ఫలితం దక్కిందని, తన నిస్వార్థ సేవకు భగవంతుడు తనకు ప్రతిఫలమిచ్చాడని
తెలిపాడు.

భవిష్యత్ ప్రణాళికలు:

గురుదేవ్ సింగ్ తన లాటరీ డబ్బును తన పిల్లలకు ఇల్లు నిర్మించడానికి, పేదలకు సేవ చేయడం కోసం ఉపయోగించాలని యోచిస్తున్నాడు. మంచి భవిష్యత్తు కోసం ఎదురుచూస్తూ, బతుకుదెరువు కోసం కష్టపడుతున్న ఎందరికో ఆయన కథ స్ఫూర్తిదాయకం. కృషి, పట్టుదల, కొంచెం అదృష్టం ఒకరి అదృష్టాన్ని ఊహించని రీతిలో మార్చగలవని ఈ కథ నిరూపిస్తోంది.