
విద్యార్థిపై ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించిన ఓ ఘటనలో, పాఠశాల విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. పంజాబ్‌లోని లూథియానా జిల్లా ముస్లిం కాలనీలోని బాల్ వికాస్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సెప్టెంబర్ 19న జరిగింది. పలు నివేదికల ప్రకారం, పాఠశాలలో ఒక విద్యార్థి ఈ వీడియోను రికార్డ్ చేశాడు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థి పెన్సిల్ పొరపాటున మరో విద్యార్థికి తగలడంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టినట్టు తెలుస్తోంది.
అంతటితో ఆగకుండగా.. పాఠశాలకు వెళ్లిన రెండో రోజు కూడా ఉపాధ్యాయుడు బాలుడిని కొట్టాడు. ఈ సంఘటన గురించి ఇంట్లో చెప్పొద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, ఒకవేళ చెప్తే విద్యార్థిని పాఠశాల నుంచి తొలగిస్తానని ఉపాధ్యాయుడు విద్యార్థిని హెచ్చరించాడు. అయితే బాలుడు నడవడానికి ఇబ్బందిగా ఉండడంతో పాటు నొప్పి కూడా రావడంతో చిన్నారి తల్లి సెప్టెంబర్ 19న గమనించింది. ఏం జరిగిందని విద్యార్థిని అడగ్గా, జరిగిన దారుణాన్ని వివరించాడు.
వరుసగా రెండో రోజు విద్యార్థిని ఉపాధ్యాయుడు కొట్టాడని తెలుసుకున్న ఆ తల్లి.. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లి, వైద్య పరీక్షలు చేయించి, ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలోనూ ఈ వీడియో వైరల్ కావడంతో విద్యార్థికి గాయాలైన విషయాన్ని పోలీసులు గమనించి.. నిందితుడైన ఉపాధ్యాయుడిని శ్రీ భగవాన్‌గా గురించి, అతన్ని అరెస్టు చేశారు.
Horrific!
— زماں (@Delhiite_) September 23, 2023
LKG student brutaIIy beåten by teacher in Ludhiana school, causing serious injuries
- accused teacher tørtured him for 2 days
- Police took sou moto & Arrested Sri Bhagwan under Sections 323, 342, 506 IPC & under Section 75, 82 of the Juvenile Act… pic.twitter.com/5Ki4XGxK5r