తిరుమలలో పునుగు పిల్లి ప్రత్యక్ష్యం.. శ్రీవారి లీల అంటున్న భక్తులు

తిరుమలలో పునుగు పిల్లి ప్రత్యక్ష్యం.. శ్రీవారి లీల అంటున్న భక్తులు

తిరుమలలో పునుగు పిల్లి ప్రత్యక్షమైంది. స్దానికులు నివాసం ఉండే బాలాజీ నగర్ లోని ఒక ఇంట్లో కనిపించింది. వెంటనే వారు టిటిడి విజిలెన్స్, అటవీ శాఖ అధికారులకు సమాచారం అవ్వడంతో.. అక్కడకి చేరుకున్న అధికారులు దానిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అది ఇంట్లోని పైభాగంలో దాక్కొని ఉండటంతో.. దానిని బయటకు రప్పించేందుకు శ్రమించాల్సి వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భారీగా అక్కడకి చేరుకుంటున్నారు. 

శ్రీవారి సేవలో పునుగు పిల్లి తైలం 

పునుగు పిల్లి తైలానికి తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన తైలమట. అందుకే పునుగు పిల్లి తైలం సేకరించి భద్రపరచి స్వామి వారికి ప్రత్యేకంగా అలంకారంగా పూస్తారు. శ్రీవారి విగ్రహం నిగనిగలాడుతూ వెలిగిపోతుండటానికి ఈ తైలమీ కారణమని చెప్తుంటారు.  

పునుగు పిల్లి రెండు సంవత్సరాల వయసు అనంతరం ప్రతి రోజు తన శరీరాన్ని గంధం చెట్టుకు రుద్దుతుంది. ఈ విధంగా చేసే సమయంలో ద్రవం చెట్టుకు అంటుకుంటుందట. దాన్ని తైలం అంటారని వినికిడి. ప్రస్తుతం ఈ జాతి అంతరించిపోయే దశకు చేరడంతో.. టీటీడీ వారే వీటిని స్వయంగా సంరక్షిస్తున్నారు.