నా శత్రువు పూరీనే.. అందుకే ఫోన్‌‌లో వాల్‌‌పేపర్‌ 

V6 Velugu Posted on May 30, 2021

హైదరాబాద్: ప్రముఖ కథా రచయిత కే విజయేంద్ర ప్రసాద్ హిట్ స్టోరీస్‌తో సత్తా చాటుతున్నారు. బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ లాంటి సినిమాలతో తన కలం సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారీ బిగ్ రైటర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్‌కు కథను అందించడంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. ఈ సినిమాతో పలు విషయాలను రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇందులో తన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరని అడిగిన ప్రశ్నకు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన జవాబు ఆశ్చర్యపర్చింది. తన కొడుకు రాజమౌళి పేరు చెబుతాడనుకుంటే.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తన ఆల్‌‌టైమ్ ఫేవరెట్ దర్శకుడని విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు.

పూరి మూవీస్ చూస్తుంటే తనకు అసూయగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ అన్నాడు. ఏకంగా పూరి ఫొటోను ఆయన తన ఫోన్‌‌ వాల్‌‌పేపర్‌గా పెట్టుకోవడం విశేషం. పూరి తన శత్రువని, ఎనిమీని దగ్గరగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని చమత్కరించాడు. భారీ సెట్స్, నాణ్యమైన వీఎప్‌ఎక్స్‌తో తాను మూవీస్‌ను తెరకెక్కిస్తుంటానని.. కానీ పూరి మాత్రం ఒక్క డైలాగ్‌‌తో సినిమా తీరునే మార్చేస్తాడని పొగిడాడు. 

Tagged SS Rajamouli, RRR, interview, Director Puri Jagannadh, Writer Vijayendra Prasad

Latest Videos

Subscribe Now

More News