పూరితో విజయ్ దేవరకొండ మ‌రో సినిమా

 పూరితో  విజయ్ దేవరకొండ మ‌రో సినిమా

విజయ్ దేవరకొండ ఫాలోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తోడైతే ఆ సినిమా ఎలా ఉంటుంది? ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటాయి. అలాంటి భారీ అంచనాల మధ్యే ‘లైగర్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీలో బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించేందుకు విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సరికొత్తగా మేకోవర్ చేశాడు పూరి. అనన్యపాండే హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. మైక్ టైసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జోహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి చార్మి, పూరి నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న మూవీ విడుదల కానుంది. ఇదిలా ఉంటే  ఈ మూవీ సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉండగానే పూరి, విజయ్ కాంబోలో మరో మూవీ ఫిక్సయినట్టు తెలుస్తోంది. అది కూడా ఓ ఇంటరెస్టింగ్ ప్రాజెక్ట్ కావడం విశేషం.  పోకిరి, బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేన్ చిత్రాల తర్వాత మహేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా ‘జనగణమన’ అనే మూవీని ప్రకటించాడు పూరి. అయితే  అనుకోని కారణాల వల్ల అది పట్టాలెక్కలేదు. తర్వాత మరికొంతమంది హీరోల పేర్లు వినిపించాయి కానీ వాళ్లూ ఈ మూవీ చేయలేదు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవరకొండతో సెట్ చేశాడట పూరి. స్ట్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా రెడీగా ఉండటంతో ‘లైగర్’ పూర్తి చేసిన వెంటనే దీన్ని సెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్.