
ఇస్మార్ట్ శంకర్ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం యూత్ లో బాగా క్రేజీ ఉన్న హీరో విజయ దేవరకొండతో కలిసి పూరి ఓ సినిమాను పట్టాలెక్కించునున్నాడు. ఈ అఫీషియల్ గా ప్రకటించింది హీరోయిన్, నిర్మాత చార్మీ కౌర్. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇప్పటికే బ్లాక్ బస్టర్ సాధించి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి, చార్మిలు ఈ మూవీని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని యూనిట్ తెలిపింది.
It’s official ????
Today is really happpyyyyy happyyyyy #Eid ???@TheDeverakonda @purijagan @PuriConnects #PCfilm #EidMubarak pic.twitter.com/NfX34DBnrl— Charmme Kaur (@Charmmeofficial) August 12, 2019