న్యూఢిల్లీ: హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ సోమవారం ప్యూరిట్ బ్రాండ్ నీటి శుద్ధి వ్యాపారాన్ని ఏఓ స్మిత్ ఇండియా వాటర్ ప్రొడక్ట్స్‌కు 72 మిలియన్ల డాలర్లకు (సుమారు రూ. 600 కోట్లు) విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా, యూనిలీవర్ తన నీటి శుద్దీకరణ వ్యాపారమైన ప్యూరిట్‌ను గ్లోబల్ వాటర్ టెక్నాలజీ కంపెనీ ఏఓ స్మిత్‌కు విక్రయించడానికి అంగీకరించినట్లు తెలిపింది.
ALSO READ : జూన్‌లో పెరిగిన గూడ్స్ ఎగుమతులు
ప్యూరిట్ భారతదేశం, బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం మెక్సికోలలో నీటి శుద్ధీకరణ పరిష్కారాలను అందిస్తుంది. 2024 చివరి నాటికి కొనుగోలును పూర్తి చేయాలని ఏవో స్మిత్ భావిస్తోంది. 2023–-24లో హెచ్‌యూఎల్ టర్నోవర్ రూ. 293 కోట్లు ఉంది.