పురుష.. కంప్లీట్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్..

పురుష.. కంప్లీట్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్..

పెళ్లి తర్వాత పురుషులు పడే అవస్థలు చూపిస్తూనే భార్యల ఇంపార్టెన్స్ తెలియజేసేలా రూపొందించిన చిత్రం ‘పురుష’. పవన్ కళ్యాణ్‌‌ బత్తుల హీరోగా పరిచయం అవుతుండగా,  వీరు వులవల దర్శకత్వం వహిస్తున్నాడు. బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.  సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. శుక్రవారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. కంప్లీట్ కామెడీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు టీజర్ ద్వారా రివీల్ చేశారు. ‘ ఏ దినము చూసినా షాపింగ్.. షాపింగ్.. షాపింగ్.. అది మా దినముకి వచ్చుచున్నది’ అంటూ భార్యాభర్తలను ఉద్దేశిస్తూ  సప్తగిరి చెప్పిన డైలాగ్ ఫన్నీగా ఉంది. 

పెళ్లి తర్వాత లైఫ్‌‌ను ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా చూపిస్తూ సాగిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.