
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ కేటగిరీలో.. తెలుగు సినీ విమర్శకుడు పురుషోత్తమాచార్యులు ఉత్తమ విమర్శకుడు అవార్డును గెలుచుకున్నారు. నల్గొండకు చెందిన డాక్టర్ పురుషోత్తమాచార్యులు గత రెండేళ్లుగా మిసిమి మాసపత్రికలో సినిమా పాటల్లో శాస్త్రీయ సంగీతంపై పరిశోధన వ్యాసాలు రాస్తున్నారు. 2021 సంవత్సరంలో రాసిన వ్యాసాలకు ఆయన ఉత్తమ విమర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు.