
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ‘పుష్ప’పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో మూవీ కావడం, అందులోనూ ప్యాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో అందరి దృష్టీ దానిపై ఉంది. కొంత గ్యాప్ తర్వాత రీసెంట్‌గా సికింద్రాబాద్‌లో షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. నటీనటులంతా ఒక్కొక్కరుగా సెట్‌లో జాయినవుతున్నారు. కీలక పాత్రలో నటిస్తున్న అనసూయ కూడా షూట్‌లో పాల్గొంటోంది. ఆ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో చెప్పింది. విలన్ పాత్రకి సెలెక్టైన ఫహాద్ ఫాజిల్ కూడా హైదరాబాద్‌కి చేరుకున్నాడు అయితే అతనప్పుడే షూటింగ్‌లో పాల్గొనడం లేదట. ముందుగా లుక్ టెస్ట్, మేకోవర్ వంటి విషయాలపై దృష్టి పెట్టాడట. తెలుగుపై పట్టు కోసం కూడా ప్రయత్నిస్తున్నాడట. అన్నింట్లో పర్‌ఫెక్ట్ అయ్యాక సెట్‌కి వస్తాడని టాక్. కొన్ని రోజుల పాటు ఇక్కడ వర్క్ చేశాక టీమ్ మొత్తం గోవాకి షిఫ్టవుతుందట. అక్కడ పదిహేను రోజులు షూట్ చేస్తే సినిమా పూర్తయినట్టే. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్‌ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీలో రష్మిక మందాన్న హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ వ్యూస్ పరంగా రికార్డ్ క్రియేట్ చేసింది. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ లిస్టులో ఈ సినిమా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అంటే ‘పుష్ప’రాజ్ ఫాలోయింగ్ ఆ రేంజ్‌లో ఉందన్నమాట.