పుష్ప కోసం బాలీవుడ్‌ నుంచి

పుష్ప కోసం బాలీవుడ్‌ నుంచి

రీమేక్ కథల కోసమే కాదు.. కీలక పాత్రల్లో నటిం చేందుకు కూడా సౌత్ సినిమా వైపు చూస్తున్నారు బాలీవుడ్ స్టార్స్. బహుశా సౌత్ లోనూ  మార్కెట్ పెంచుకోవడం వారి ఉద్దేశమై ఉండొచ్చు. కారణం ఏదైనప్పటికీ తెలుగు, తమిళ చిత్రాల్లో అక్షయ్ కుమార్ లాంటి బడా స్టార్స్ కూడా విలన్లుగా నటిస్తు న్నారు.

ప్రస్తుతం అజయ్ దేవగన్ కూడా ‘ఆర్ఆర్ఆ ర్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అది నెగిటివ్ పాత్రా పాజిటివ్ క్యారక్టర్ అనేది ఇంకా తెలీదు. ఇప్పుడీ బాటలో మరో బాలీవుడ్ స్టార్ కూడా బన్నీ సినిమాలో విలన్గా నటించబోతున్నాడట. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో నెగిటివ్ రోల్ కోసం బాలీవుడ్ హీరోని తీసుకోవాలని భావిస్తున్నారట.

5 భాషల్లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమా కావడం, అందునా హిందీలోనూ రిలీజ్ కానుండడంతో ఈ నిర్ణయానికి  వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సంజయ్ దత్, సునీల్ శెట్టి, జాక్రీషాఫ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జాకీ తెలుగు సినిమా లకు కొత్తేమీ కాదు కనుక మిగతా ఇద్ద రిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట. సంజయ్ ఇప్పటికే ‘కేజీఎఫ్ 2’లో కీలక పాత్ర పో షిస్తున్నాడు. ఆల్రెడీ శాండిల్ ఉడ్ కు  వచ్చేశాడు కనుక ఆయన్నే బెంగళూరునుండి హైదరాబాద్ రప్పించవచ్చు. సునీల్‌‌శెట్టి ఇప్పటికే కన్నడ మూవీ ‘పహిల్వాన్‌‌’తో పాటు తమిళంలో ‘దర్బార్’ చేశాడు. మలయాళంలో ‘మరక్కార్‌‌‌‌’లోనూ నటిస్తున్నాడు. ఆల్రెడీ సౌత్‌‌లో పాగా వేశాడు కనుక అతడినేదించేయ వచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.