ఉక్రెయిన్ తో యుద్ధాన్ని తొందర్లోనే ముగిస్తం: పుతిన్ 

ఉక్రెయిన్ తో యుద్ధాన్ని తొందర్లోనే ముగిస్తం: పుతిన్ 

అస్థానా(కజకిస్తాన్): ఉక్రెయిన్​తో యుద్ధాన్ని వీలైనంత తొందరగా ముగించేస్తామని రష్యా ప్రెసిడెంట్​ వ్లాదిమిర్​ పుతిన్​ చెప్పారు. ఈమేరకు ఆయన శుక్రవారం కజకిస్తాన్​ రాజధాని అస్థానాలో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్​పై ఇక భారీ దాడులు చేయాల్సిన​ అవసరంలేదని అభిప్రాయపడ్డారు. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలనేది తమ అభిమతం కాదని పుతిన్​ తేల్చిచెప్పారు. రష్యా–ఉక్రెయిన్​ల మధ్య శాంతి చర్చలు జరగాలని ఇండియా, చైనాలు చాలా ప్రయత్నించాయని పుతిన్​ పేర్కొన్నారు.

యుద్ధాన్ని ఆపడానికి ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాన్ని పుతిన్​ గుర్తుచేసుకున్నారు. యుద్ధంపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారనీ చెప్పుకొచ్చారు. కిందటి నెలలో జరిగిన షాంఘై కో ఆపరేషన్​ ఆర్గనైజేషన్(ఎస్ సీవో) సమిట్​ సందర్భంగా మోడీతో మాటల మధ్య ఉక్రెయిన్​ యుద్ధం చర్చకొచ్చిందని తెలిపారు. ఆ రెండు దేశాల కన్సర్న్​ను రష్యా గుర్తించిందని, వీలైనంత తొందరగా యుద్ధాన్ని ముగిస్తామని పుతిన్​ వివరించారు.