ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసమే దాడులు

ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసమే దాడులు

ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యా.. తన చర్యను ఐక్యరాజ్య సమితి (యూఎన్) వేదికగా సమర్థించుకుంది. ఉక్రెయిన్ ప్రజల రక్షణ కోసమే తమ అధ్యక్షడు పుతిన్ మిలిటరీ ఆపరేషన్ నిర్ణయం తీసుకున్నారని రష్యా ప్రతినిధి యునైటడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా బాధపడుతున్న ఉక్రియెన్ ప్రజల క్షేమం కోసం పుతిన్ దాడులు చేశామన్నారు. “మేము ఉక్రెయిన్‌ను మారణహోమం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము.. UN చార్టర్‌లోని ఆర్టికల్ 51కి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం.. మేము పరిస్థితిని విశ్లేషిస్తాము,” అని రష్యా ప్రతినిధి తెలిపారు. 

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్‌పై దండయాత్రకు ఆదేశించారు, ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని మాస్కో ప్లాన్ చేయడం లేదని అన్నారు. అతను ప్రకటించిన సైనిక చర్య ఉక్రెయిన్‌ను "సైనికీకరణ" చేయడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్ నుండి వచ్చిన బెదిరింపులకు ప్రతిస్పందనగా దాడులు చేస్తున్నామని చెప్పాడు. మరోవైపు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో ఉక్రెయిన్ ప్రతినిధి మాట్లాడుతూ.. రష్యా డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసిందన్నారు. యూఎన్ఓ ఈ దాడుల్ని అడ్డుకోవాలన్నారు. రష్యా అధ్యక్షుడు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మేం ఇందుకు సాక్ష్యంగా చూపిస్తామన్నారు. 

ఇవి కూడా చదవండి:

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానం

ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా