ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా

ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా

ఉక్రెయిన్పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఇప్పటికే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా ఆర్మీ. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా.. ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా....రష్యా మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్ బలగాలు వెంటనే ఆయుధాలు విడిచి వెనక్కి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది రష్యా. ఇప్పటి వరకు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రష్యా బలగాలు.. ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్తున్నాయి. ఉక్రెయిన్పై నలువైపులా నుంచి రష్యా మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది . 

రష్యా చర్యలకు ప్రతి చర్యలతో ఉక్రెయిన్ అప్రమత్తమైంది. ఉక్రెయిన్ లో ఇప్పటికే ఎమర్జెన్సీ విధించారు. నెల రోజుల పాటు ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. ఎమర్జెన్సీ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు, సమావేశాలు, సభలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. అవసరమైతే మరో 30 రోజులు ఎమర్జెన్సీ విధిస్తామని తెలిపింది ఉక్రెయిన్. రష్యా దాడులను తిప్పి కొట్టడానికి అన్ని విధాల సిద్ధమైంది ఉక్రెయిన్.  దేశ ప్రజలనుద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమీర్ జెలెన్ స్కీ. రష్యా ప్రెసిడెంట్ పుతిన్కు తాను ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడంలేదన్నారు. ఉక్రెయిన్ ప్రజల స్వతంత్రత, స్వేచ్ఛను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు జెలెన్ స్కీ. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్పై రష్యా దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

మరిన్ని వార్తల కోసం:

తక్కువ ధరకు  వ్యాక్సిన్లు అందిస్తున్నరు