తక్కువ ధరకు  వ్యాక్సిన్లు అందిస్తున్నరు

తక్కువ ధరకు  వ్యాక్సిన్లు అందిస్తున్నరు

మన తయారీదారులకు బిల్​గేట్స్ మెచ్చుకోలు
వాషింగ్టన్‌‌:
తక్కువ ధరకు నాణ్యమైన వ్యాక్సిన్లను ప్రపంచమంతా పంపిణీ చేస్తున్నారని ఇండియన్​ వ్యాక్సిన్​ తయారీదారులను బిల్​గేట్స్ మెచ్చుకున్నరు. దాదాపు అన్ని దేశాలకూ వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చినందుకు మైక్రోసాఫ్ట్​ కో ఫౌండర్​ థ్యాంక్స్​ చెప్పారు. ఇండియన్‌‌ ఎంబసీలో ఇండియా అమెరికా హెల్త్‌‌ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్‌‌పై జరిగిన వర్చువల్‌‌ రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కిందటేడాది దాదాపు 100 దేశాలకు 150 మిలియన్‌‌ కరోనా వ్యాక్సిన్‌‌ డోసులను ఇండియా డెలివరీ చేసిందన్నారు. న్యుమోనియా, రోటా వైరస్‌‌ వంటి వ్యాధుల నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికి ఇప్పుడు వ్యాక్సిన్లను అందిస్తోందని చెప్పారు. ప్రపంచానికి వ్యాక్సిన్లను తక్కువ ధరకు అందుబాటు లో ఉంచేందుకు బైలేటరల్‌‌ భాగస్వా మ్యాన్ని ఉపయోగించకుకోవడం కోసం ఇండియా, అమెరికాలో ఉన్న స్టేక్‌‌ హోల్డర్‌‌‌‌లను ఒకచోట చేర్చడానికి ఈ రౌండ్‌‌ టేబుల్‌‌ సమావేశం నిర్వహిం చారు. కరోనా ప్యాండెమిక్‌‌ ఇంకా అంతం కాలేదని, కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని, దీన్ని ఎదుర్కొనేం దుకు మనమందరం రెడీగా ఉండాలని బిల్‌‌ గేట్స్‌‌ అన్నారు.