ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానం

ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రత్యేక విమానం

ఉక్రెయిన్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంపై రష్యా దాడులకు దిగింది. మూడు వైపుల నుంచి దాడులు చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ఇప్పటికే అక్కడకు విమానాలు పంపింది. తాజాగా విద్యార్థులతో సహా భారతీయ పౌరులతో కూడిన ఉక్రెయిన్ నుండి ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ నుంచి భారత్ కు చేరుకున్న ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని మాట్లాడుతూ.. మేం నివసించే స్థలం సరిహద్దుకు దూరంగా ఉన్నందున అక్కడ పరిస్థితి బాగానే ఉందన్నారు. కానీ మా రాయబార కార్యాలయం మమ్మల్ని దేశం విడిచిపెట్టమని చెప్పిందని తెలిపారు. దీంతో వారి ఆదేశాలు జారీ చేసిన తర్వాత భారత్ కు  తిరిగి వచ్చామని MBBS విద్యార్థిని తెలిపారు.  మరో విద్యార్థి మాట్లాడుతూ.. గత రాత్రే తమకు 30 రోజుల పాటు ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితి గురించి మెసేజ్ వచ్చిందన్నారు. కాబట్టి మేము ఇంటికి తిరిగి వచ్చామన్నారు. దీంతో ఉక్రెయిన్ నుండి తిరిగి వచ్చమన్నారు. 

మరోవైపు ఇవాళ ఉదయం నుంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభించారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాలు ఈ అంశంలో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే 'ఇదివరకు ఎన్నడూ చూడని పరిణామాలు చూడాల్సి ఉంటుంది' హెచ్చరికలు పంపారు. దీంతో పుతిన్ ప్రకటనపై అమెరికా వెంటనే స్పందించింది. రష్యా చేసే ఈ దాడుల వల్ల జరిగే విధ్వంసం, ప్రాణనష్టానికి ఆ దేశానిదే పూర్తి బాధ్యత అని అగ్రరాజ్యం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

రష్యా దురాక్రమణపై ప్రపంచం స్పందించాలె

ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా