ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పత్తి కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్​ సీహెచ్​ శివలింగయ్య

జనగామ అర్బన్​, వెలుగు : పత్తి కొనుగోళ్లకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ సీహెచ్​శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లోని కాన్ఫరెన్స్​హాల్​లో పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ మార్కెట్, సీసీఐ అధికారులు, జిన్నింగ్​ మిల్స్​ ఓనర్స్ తో కలెక్టర్ ​మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో లక్షా 40 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారన్నారు.  8 లక్షల క్వింటాళ్ల కు పైగా పత్తి వస్తుందని అంచనా ఉందన్నారు. పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ. 6,300 లు ఉండగా మార్కెట్లో రూ. 8000 కు పైగా ఉందని తెలిపారు.  ఫైర్​, ఎలక్ట్రికల్​, లీగల్​ మెట్రాలజీ సంబంధిత అధికారులు కోఆర్డినేషన్​తో పర్యవేక్షణ చేపట్టాలన్నారు.  అడిషనల్​ కలెక్టర్​ అబ్దుల్​ హామీద్​, మార్కెట్​ ఆఫీసర్​ నాగేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. 

డిగ్రీ కాలేజీలో వైభవంగా బతుకమ్మ వేడుకలు

చిట్యాల, వెలుగు: మండల కేంద్రంలోని సువిద్య డిగ్రీ కాలేజీలో శుక్రవారం   బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. కాలేజీ స్టూడెంట్ల కోలాటాలు, డ్యాన్సులు చూపరులను ఆకట్టుకున్నాయి. కాలేజీ కరస్పాండెంట్​ కందికొండ రాజు, లెక్చరర్లు వేణు, లోకేందర్​, సంతోష్​, స్వామి, రమేశ్​ పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో శ్రీధర్​బాబును సాగనంపండి

కాటారం, వెలుగు : మంథని నియోజకర్గానికి 40 ఏండ్లకు పైగా ఎమ్మెల్యేలుగా ఉన్న  తండ్రి కొడుకులు మాజీ స్పీకర్ శ్రీపాద రావు, ఎమ్మెల్యే శ్రీధర్ బాబులు అభివృద్ధి చేయకుండా అంధకారంలోకి నెట్టారని, వచ్చే ఎన్నికల్లో శ్రీధర్​బాబును సాగనంపాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పిలుపునిచ్చారు. ప్రజా చైతన్య యాత్ర పేరుతో నియోజకవర్గ యువకులు నిర్వహించిన యాత్ర కాటారంలో ముగియగా, ముగింపు సమావేశానికి పుట్ట మధు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్​ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను తన పనులుగా చెప్పుకొని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన పనులను, శ్రీధర్ బాబు చేసిన పనులపై ప్రజాక్షేత్రంలో చర్చించడానికి రెడీనా ? అని సవాల్​విసిరారు. ఎన్ని ఆటంకాలొచ్చినా ప్రజాసేవలో ముందుంటానని మధు చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్మన్ శ్రీహర్షిని, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ, పీఏసీఎస్​చైర్మన్ లు చల్ల నారాయణ రెడ్డి, తిరుపతయ్య, భూపల్లి రాజు, తోట జనార్దన్, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు. 

బతుకమ్మ చీరల పంపిణీ

నర్మెట్ట, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలను ఆడపడుచులందరికీ అందిస్తున్నామని నర్మెట్ట ఎంపీపీ తేజావత్ గోవర్ధన్ అన్నారు. గ్రామపంచాయతీ ఆవరణలో   సర్పంచ్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి గోవర్ధన్​హాజరయ్యారు. టీఆర్ఎస్​మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, వైస్ ఎంపీపీ అగారెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ప్రణీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నియంత పాలనను తరిమేందుకు యువత సిద్ధం

వెంకటాపూర్ (రామప్ప) వెలుగు : కేసీఆర్​నియంత పాలనను తరిమేందుకు గ్రామాల్లో యువత సిద్ధమవుతోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెంకటాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు భూక్య జవహర్ లాల్ ఆధ్వర్యంలో పాలంపేట గ్రామానికి చెందిన 150మం ది కాంగ్రెస్,  టీఆర్ఎస్ నాయకులు బీజేపీ లో చేరారు. రామప్ప ఆలయానికి వెళ్లే ఆర్చి వద్ద భాస్కర్​రెడ్డి వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

అమ్మవారికి పూజలు చేసిన బీజేపీ నేతలు

నర్సంపేట, వెలుగు : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నర్సంపేట టౌన్​లో స్వామి వివేకానంద యూత్​ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని బీజేపీ వరంగల్​ జిల్లా నాయకుడు డాక్టర్​గోగుల రాణాప్రతాప్​రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ‘రాణా’ మహా అన్నదానం కార్యక్రమం ప్రారంభించారు. పైండ్ల అర్జున్​, గన్నారపు అర్జున్​, అంకాల సాగర్​, కక్కెర్ల శివ,  రాంకీ,  క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. 

జనగామలో..

జనగామ, వెలుగు : అన్నదానం మహాదానమని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కొమ్మూరి ప్రతాప్​ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జనగామ పట్టణంలోని గిర్నిబావికుంటలో ప్రతిష్టించిన అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదానం కోసం రూ. 5,116 విరాళం అందించారు. అంతకు ముందు గ్రెయిన్​ మార్కెట్​ అభయాంజనేయ స్వామి ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. ఆకుల వేణుగోపాల్ రావు, ఆలయ కమిటీ సభ్యులు మాశెట్టి వెంకన్న, రవీందర్, గంప సీతారాములు, శర్విరాల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. 

కొత్తూరు(సి)ని కురవి మండలంలోనే ఉంచాలి

కురవి, వెలుగు:  కొత్తగా ఏర్పాటైనా  సీరోలు మండలంలో  కొత్తూరు (సి) గ్రామాన్ని  కలుపొద్దని.. కురవి మండలంలోనే ఉంచాలని ఆ గ్రామస్తులు నేషనల్ హైవే పై కందికొండ స్టేజీ వద్ద  బతుకమ్మలు పెట్టి రాస్తారోకో చేశారు. సర్పంచ్ యానాల గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆల్​పార్టీ లీడర్లు, గ్రామస్తులు, మహిళలు భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. రెండు గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించడంతో వెహికల్స్​ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సీరోలు పోలీసులు అక్కడకు చేరుకోని గ్రామస్తుల డిమాండ్లను ఉన్నతాధికారులకు వివరిస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు.

కుటుంబం ఆత్మహత్యాయత్నం

తొర్రూరు (పెద్దవంగర), వెలుగు: మహబూబాబాద్​జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఓ రైతు కుటుంబం శుక్రవారం తహసీల్దార్ ఆఫీస్​ఎదుట పెట్రోల్​పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పోలీసులు, స్థానికులు వారి చేతిలోని పెట్రోల్ బాటిల్​లాక్కున్నారు. బాధితుల కథనం ప్రకారం..మండల కేంద్రానికి చెందిన ఎడవెల్లి సతీశ్​రెడ్డి కుటుంబానికి పెద్దవంగర శివారు 541/1 సర్వే నెంబర్ లో ఎకరం 22 గుంటల భూమి ఉంది. కొన్నేండ్ల నుంచి ఆ  భూమి సతీశ్​రెడ్డి స్వాధీనంలోనే ఉంది. 2019 ఆగస్టులో రాయపర్తి మండలం కొండూరుకు చెందిన సతీశ్​రెడ్డి చెల్లెలు మిన్కూరి సరిత (ఐఎల్ఆర్ఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిని విక్రయించేందుకు ఆమె 2 ఫిబ్రవరి 2022 లో స్లాట్ బుక్​చేయగా..మరుసటిరోజే సతీశ్​రెడ్డి తహసీల్దార్​ను కలిసి ఆ భూమి తమదని న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చాడు. ఈ విషయమై ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆర్డర్ తో సరిత ఆ భూమిని ఆగస్టు 2022లో హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించింది. దీంతో వారసత్వంగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని తన సోదరి రిజిస్ట్రేషన్ చేసుకుందని ఆరోపిస్తూ, తమకు న్యాయం చేయాలని సతీశ్​రెడ్డి, ఆయన భార్య పద్మ, ఇద్దరు కుమారులతో కలిసి తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పెట్రోల్​పోసుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.   ఏఎస్సై కుమారస్వామి బాధితులతో మాట్లాడి అక్కడి నుంచి పంపించి వేశారు. దీనిపై తహసీల్దార్​ రమేశ్​బాబును వివరణ కోరగా ధరణి  రూల్స్​ మేరకు రిజిస్ట్రేషన్ చేశామని, ఏదైనా వివాదం అనుకుంటే కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేశారు.

ఘనంగా ఎమ్మెల్యే బర్త్​డే

ఎల్కతుర్తి, వెలుగు: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడిశాల సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ బర్త్​డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్ డాక్టర్ మారెపల్లి సుధీర్ కుమార్, ఎమ్మెల్యే తనయుడు వొడితల ఇంద్రనీల్ హాజరై కేక్ కట్ చేశారు. ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సింగిల్విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆటలు స్నేహభావాన్ని పెంచుతాయి

చిట్యాల, వెలుగు: ఆటలు స్నేహభావం పెంచుతాయని చిట్యాల సీఐ పులి వెంకట్​అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన పోలీస్ ​దోస్త్​ వాలీబాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. పోటీల్లో చిట్యాల ప్రథమ స్థానం, గిద్దె ముత్తారం ద్వితీయ స్థానం, చల్ల గరిగ తృతీయ స్థానాల్లో నిలువగా, విజేతలకు  సీఐ బహుమతులు అందజేశారు. ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్​, ఎంపీపీ దావు వినోద, జడ్పీటీసీ సాగర్ పాల్గొన్నారు. 

పిడుగు పడి ఒకరు మృతి.. రెండు దుక్కిటెద్దులు కూడా..

పాలకుర్తి ( దేవరుప్పుల), వెలుగు: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దుబ్బతండాలో పిడుగుపడి ఒకరు చనిపోయారు. తండాకు చెందిన లాకావత్​సురేందర్​( 35 ) గురువారం సాయంత్రం పొలంలో మేకలు మేపుతుండగా పిడుగు పడటంతో అక్కడిక్కడే మరణించాడు.  విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సురేందర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అలాగే దేవరుప్పుల మండలం నల్లకుంట తండాలో రైతు సాంక్రు తన వ్యవసాయ బావి వద్ద కొట్టంలో ఎడ్లను కట్టేసి ఇంటికి వెళ్లాడు. అప్పుడే ఉరుములు, మెరుపులతో వాన మొదలై కొట్టంపై పిడుగుపడడంతో రెండు ఎద్దులు అక్కడికక్కడే చనిపోయాయి.  

ములుగు, వెలుగు: పాపులర్ ఫ్రంట్​ఆఫ్​ఇండియా ( పీఎఫ్ఐ) ని కేంద్రప్రభుత్వం నిషేదిస్తే.. వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్​, టీఆర్ఎస్​, ఆర్జేడీ, వామపక్ష పార్టీలకు  పీఎఫ్​ఐ కి మద్దతు ఇస్తున్నామని చెప్పుకునే దమ్ముందా? అని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ జాడి రామరాజు నేత ప్రశ్నించారు. శుక్రవారం ములుగులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో   కాంగ్రెస్ ​పార్టీ అల్లర్లు సృష్టించి అధికారంలోకి రావాలని  చూస్తోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పార్టీలను ప్రజలే భూస్థాపితం చేస్తారన్నారు.