వేడి వేడి బువ్వ, చింతపండు తొక్కు.. అదే పీవీ పరమాన్నం

వేడి వేడి బువ్వ, చింతపండు తొక్కు.. అదే పీవీ పరమాన్నం

హనుమకొండ, వెలుగు: పీవీ నరసింహరావు సంపూర్ణ శాకాహారి. మాంసాహారం జోలికి వెళ్లకుండా ఆకుకూరలు, కూరగాయల భోజనానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. వేడివేడి బువ్వలో చింతపండు తొక్కు వేసుకుని తినడాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. దాంతో పాటు నెయ్యి, మజ్జిగకు కూడా ప్రాధాన్యం ఇచ్చేవారు. మధ్యాహ్న భోజనంలో పప్పు, చారు తీసుకునేవారు. కాగా, పీవీ స్వగ్రామం వంగరకు చెందిన కాల్వ రాజయ్య వండితే  పీవీ ఇష్టంగా తినేవారు.

1972 నుంచి మొదలు కాల్వ రాజయ్యను తన వెంటే పెట్టుకున్న పీవీ.. తాను మరణించేంత వరకు ఆయన చేతి వంటే  తిన్నారు. తనకు నచ్చినట్టు వండే వ్యక్తి కావడంతో పీవీ ఏ రాష్ట్రానికెళ్లినా కాల్వ రాజయ్యను వెంట తీసుకువెళ్లేవారు.  కాల్వ రాజయ్య ప్రస్తుతం ఆయన కూతురు సురభి వాణీదేవి ఇంట్లో వంటలు చేస్తుండడం విశేషం.