మలేసియా మాస్టర్స్‌‌‌‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో సింధు

మలేసియా మాస్టర్స్‌‌‌‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌ సెమీస్‌‌‌‌లో సింధు

కౌలాలంపూర్‌ ‌‌‌‌‌‌‌: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌‌‌‌ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌‌‌‌లో సెమీఫైనల్‌‌‌‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో  15వ ర్యాంకర్ సింధు 21-–13, 14-–21, 21–-12తో  టాప్ సీడ్ హన్ యుయె (చైనా)పై పోరాడి విజయం సాధించింది. 55 నిమిషాల పోరులో తొలి గేమ్‌‌‌‌ను ఈజీగా నెగ్గిన సింధు తర్వాత తడబడింది.

కానీ, మూడో గేమ్‌‌‌‌లో తన మార్కు షాట్లతో టాప్ సీడ్ ఆట కట్టించింది. సెమీస్‌‌‌‌లో తను ఇండోనేసియా షట్లర్ బుసానన్‌‌‌‌తో పోటీ పడనుంది. మరో క్వార్టర్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో చాలిహా 10–21, 15–21తో ఆరో సీడ్‌‌‌‌ జాంగ్ యి మన్ (చైనా) చేతిలో పరాజయం పాలై ఇంటిదారి పట్టింది.