V6 News

సింధు, సేన్‌‌‌‌‌‌‌‌ నాయకత్వంలో.. ఆసియా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌ బరిలో ఇండియా

సింధు, సేన్‌‌‌‌‌‌‌‌ నాయకత్వంలో.. ఆసియా బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌ బరిలో ఇండియా

న్యూఢిల్లీ: ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బలమైన జట్లతో బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు చైనాలోని కింగ్డావోలో జరిగే ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే విమెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌కు స్టార్ షట్లర్ పీవీ సింధు, మెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌కు వరల్డ్ నంబర్ 13 లక్ష్యసేన్  జట్టుకు నాయకత్వం వహిస్తారు. ఈ మేరకు ఇరు జట్లను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) గురువారం ప్రకటించింది. 

డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌ అయిన అమ్మాయిల టీమ్‌‌‌‌‌‌‌‌లో యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్స్ ఉన్నతి హుడా, తన్వీ శర్మ సింధుకు మద్దతుగా నిలుస్తారు. డబుల్స్‌‌‌‌‌‌‌‌లో  పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జోడీ కీలక పాత్ర పోషించనుంది. మెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌  లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌తో పాటు మాజీ నంబర్ వన్  కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్,స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌‌‌‌‌‌‌‌సాయిరాజ్–-చిరాగ్ శెట్టితో బలంగా ఉంది. 

ఇండియా మెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌:
లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ హెచ్ఎస్, మన్నేపల్లి తరుణ్ , సాత్విక్‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌, చిరాగ్ శెట్టి, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్, సాయి ప్రతీక్, హరిహరన్.


విమెన్స్ టీమ్‌‌‌‌‌‌‌‌: పీవీ సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మ, రక్షిత శ్రీ సంతోష్ రామ్రాజ్, మాళవిక  బన్సోడ్, పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ, ప్రియా, శ్రుతి మిశ్రా, తనీషా క్రాస్టో