మరోసారి నిరాశ పర్చిన పీవీ సింధు

మరోసారి నిరాశ పర్చిన పీవీ సింధు

బాసెల్‌‌‌‌: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ పీవీ సింధు మరోసారి నిరాశ పరిచింది. స్విస్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌300 టోర్నమెంట్‌‌లో టైటిల్‌‌ నిలబెట్టుకోలేకపోయింది. మెగా టోర్నీలో సింధు.. ప్రిక్వార్టర్స్‌‌లోనే ఇంటిదారి పట్టగా.. మెన్స్‌‌ డబుల్స్‌‌లో సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి ద్వయం క్వార్టర్‌‌ ఫైనల్‌‌ చేరుకుంది. గురువారం రాత్రి జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో  38వ ర్యాంకర్‌‌, అన్‌‌సీడెడ్‌‌ పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేసియా) 21–15, 12–21, 21–18తో 9వ ర్యాంకర్‌‌, నాలుగో సీడ్‌‌  సింధుకు షాకిచ్చింది. కాగా, మెన్స్‌‌ డబుల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో రెండో సీడ్‌‌ సాత్విక్‌‌–చిరాగ్‌‌ 12–21, 21–17, 28–26తో తైవాన్‌‌ జంట ఫాంగ్‌‌ చి లియా–ఫంగ్‌‌ జెన్‌‌ లీపై ఉత్కంఠ విజయం సాధించింది.