
మనుషులే కాదు..ఈ మధ్య జంతువులు కూడా నగదును చోరీ చేస్తున్నాయి. జంతువుల్లో ముఖ్యంగా ఓ పాము అయితే..నోట్ల కట్టనే దొంగిలించి మెల్లగా జారుకుంది. నోట్ల కట్టను నోట కరుచుకుని తీసుకెళ్తోంది ఓ కొండ చిలువ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళ్తే..
జింబాబ్వేలో ఓ కొండ చిలువ నోట్ల కట్టను దొంగిలించింది. ఆ నోట్ల కట్ట ఎక్కడ దొంగతనం చేసిందో తెలియదు కానీ..తన నోట కర్చుకుని యజమాని దగ్గరకు వచ్చింది. మెల్లగా యజమాని ఇంట్లోకి నోట్ల కట్టతో దూరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కొండ చిలువ నోట్ల కట్టను తీసుకెళ్తున్న వీడియోను లక్షల మంది వీక్షించారు. వేల మంది లైక్ కొట్టారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. పాము నోటికి నోట్ల కట్టను కట్టడం నేరం అని..జంతు హింసకిందకు వస్తుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరో నెటిజన్ అయితే పామును ఎవరో లాగుతున్నారని..పాము నోటికి కరెన్సీ కట్టను కట్టి లాగినట్లు అనిపిస్తుందని కామెంట్ పెట్టాడు.