
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని ఫార్చ్యూన్ హోండా షోరూంలో కొత్తగా లాంచ్‌చేసిన క్యూసీ–1 ఎలక్ట్రిక్బైకులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ మోడల్బైక్ను బెంగళూరు, ఫుణె, ఢిల్లీ, చంఢీఘర్‌లో లాంచ్‌చేశారు. తాజాగా ఎంజీ రోడ్డులోని షోరూంలో అందుబాటులోకి తెచ్చారు.
20 మంది కస్టమర్లకు డెలివరీ చేశారు. షోరూం డైరెక్టర్లు నీరవ్‌మోదీ, ఆశీష్మోదీ, సీఎఫ్ఓ రవిప్రకాశ్, జీఎం సైమన్లు మాట్లాడుతూ.. క్యూసీ–1 బైక్కేవలం 1.5 యూనిట్విద్యుత్ ఖర్చుతో ఒకసారి చార్జ్‌చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు.