వరల్డ్ కప్ టీమ్లో ఉండాలంటే ముందు ఆ పని చేయండి.. కోహ్లీ, రోహిత్కు అశ్విన్ స్ట్రాంగ్ వార్నింగ్

వరల్డ్ కప్ టీమ్లో ఉండాలంటే ముందు ఆ పని చేయండి.. కోహ్లీ, రోహిత్కు అశ్విన్ స్ట్రాంగ్ వార్నింగ్

క్రికెట్ కమ్యూనిటీలో ఇప్పుడంతా ఒకటే చర్చ. వచ్చే వరల్డ్ కప్ కు కోహ్లీ, రోహిత్ శర్మ ఆడతారా లేదా అని. ఆస్ట్రేలియాతో వన్డే సీరీస్ స్క్వాడ్ లో రోకో జోడి ఉన్నప్పటికీ.. కెప్టెన్సీ బాధ్యతలు గిల్ అప్పగించడం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. రోహిత్ కే ఈ సీరీస్ పగ్గాలు అప్పగిస్తారని భావించినా.. శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా ప్రకటించడంతో.. రోకో జోడి ఫ్యూచర్ పై డౌట్స్ మొదలయ్యాయి. 

టీ20, టెస్టు లకు ఈ ఇద్దరు సీనియర్లు రిటైర్మెంట్ ప్రకటించగా.. కేవలం వన్డేలకు మాత్రం ఆడనున్నారు. ఈ క్రమంలో వన్డే కెప్టెన్ గా రోహిత్ నే కొనసాగిస్తారని భావించారు అందరూ. దీనిపై రకరకాల చర్చలు కూడా నడుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్-2027 దృష్టిలో ఉంచుకుని అశ్విన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. 

వచ్చే వరల్డ్ కప్ టీమ్ లో ఉండాలంటే రోహిత్, కోహ్లీ సీరియస్నెస్ చూపించాలని సలహా ఇచ్చాడు అశ్విన్. వరల్డ్ కప్ కు ఆడాలనే తపన ఉంటే ఆ సీరియస్ నెస్ ను ఆటలో చూపించాలని హితవు పలికాడు. అందుకోసం ఈ సీరిస్ లో తమ సత్తా ఏంటో చూపించాలన్నారు. ఈ సీరీస్ లో ఆడలేక పోతే.. వచ్చే వరల్డ్ కప్ ప్లాన్ లో మీరు లేనట్లేనని అన్నాడు.

మరోవైపు ఈ సీరీస్ తో పాటు దేశవాళీ క్రికెట్ కూడా ఆడాలని.. ఆ విధంగా తమ సీరియన్ నెస్, నిబద్ధత చూపించాలని చెప్పాడు. చాలా మంది రంజీల్లో ఆడటం చిన్నతనంగా భావిస్తారని.. కానీ తన నిబద్ధత ఏంటో నిరూపించాలంటే ఆడాల్సిందేనని హితవు పలికాడు అశ్విన్. ఒకవేళ ఈ సీరీస్ లో ఆడలేనట్లైతే విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని సూచించాడు. 

అయితే ఆటపై సీరియస్ గా ఉన్నప్పటికీ.. రోకో జోడీ ఏజ్ ఒక సమస్యగా మారింది. ఇప్పటికే రోహిత్ 38 ఏళ్లకు చేరుకున్నాడు. మరోవైపు కోహ్లీఈ నవంబర్ కు 37 ఏళ్లకు చేరుకుంటాడు. దీంతో వీళ్ల వన్డే వరల్డ్ కప్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిన సందర్భంలో.. అశ్విన్ చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ చర్చకు దారితీశాయి.