రోస్టర్ విధానంతో బీసీలకు అన్యాయం..వెంటనే ఈ విధానాన్ని సవరించాలి: ఆర్.కృష్ణయ్య 

రోస్టర్ విధానంతో బీసీలకు అన్యాయం..వెంటనే ఈ విధానాన్ని సవరించాలి: ఆర్.కృష్ణయ్య 

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల నియామకాల్లో అమలు చేస్తున్న రోస్టర్ విధానం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్​.కృష్ణయ్య ఆరోపించారు. ఆదివారం విద్యానగర్‌‌‌‌‌‌ లోని బీసీ భవన్​లో సి.రాజేందర్ అధ్యక్షతన వివిధ బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులతో చర్చించిన అనంతరం ఆర్​.కృష్ణయ్య సీఎం రేవంత్​ రెడ్డికి లేఖ రాశారు.

రోస్టర్ విధానం లోపభూయిష్టంగా, శాస్త్రీయత లేకుండా ఉందని విమర్శిం చారు. ఈ విధానం వల్ల బీసీలకు రావాల్సిన ఉద్యోగావకాశాలు తగ్గి పోతున్నాయన్నారు.  బీసీలకు నష్టం జరిగేలా ఉన్న ప్రస్తుత రోస్టర్‌‌‌‌ను వెంటనే సవరించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు.