పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు స్టైపెండ్ ఇవ్వాలె

పోటీ పరీక్షల ప్రిపరేషన్ కు స్టైపెండ్ ఇవ్వాలె

హైదరాబాద్: ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నిరుద్యోగులకు నెలకి రూ.5 వేల స్టైపెండ్, కోచింగ్ కు కావాల్సిన ఫీజును ప్రభుత్వం ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం దిల్షుఖ్ నగర్ లో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ జాక్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రూప్స్, టీచర్, పోలీసు ఉద్యోగాల కోసం చాలా మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యారన్నారు. ఐతే.. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అధిక ఫీజులు వసూలు చేస్తూ నిరుద్యోగులను దోచుకుంటున్నాయన్నారు. ఇక హాస్టల్ ఫీజ్, రూమ్ రెంట్ వీటికి అదనమని,  ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకోవడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు సాధ్యం కాదన్నారు. కానీ కోచింగ్ తీసుకోకపోతే వారంతా పరీక్షల్లో వెనకబడిపోతారని, ఉద్యోగాలన్నీ సంపన్న వర్గాల వారికే వెళ్తాయన్నారు. దీంతో పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశముందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగార్థులకు స్టైపెండ్ , ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేయాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం...

బుద్ధవనం ప్రాజెక్టుకు కేంద్ర నిధులు

ఫ్యూచరంతా ఓటీటీలదే..