పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలె : ఆర్ కృష్ణయ్య

పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలె : ఆర్ కృష్ణయ్య

తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చేపట్టిన ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో విద్యార్థులకు రూ.20 వేల స్కాలర్ షిప్ ఇస్తుంటే ఇక్కడ మాత్రం రూ.5,500 మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం తరహాలో ఇక్కడ కూడా స్కాలర్ షిప్ లను పెంచాలని సూచించారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ.500 పాకెట్ మనీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇస్తూ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ విద్యార్థుల పట్ల తన వైఖరి మార్చుకొని స్కాలర్ షిప్ లను పెంచి... పెండింగ్ స్కాలర్ షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

పెండింగ్ స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు బైఠాయించి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం మొండి వైఖరిని వదిలి విద్యార్థులకు స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని సూచించారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.