ఫీజు రీయింబ్స్ మెంట్ కోసం ఉన్నత విద్యా మండలి ముట్టడిలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య

 ఫీజు రీయింబ్స్ మెంట్ కోసం ఉన్నత విద్యా మండలి ముట్టడిలో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య

మెహిదీపట్నం, వెలుగు: విద్యార్థుల ఫీజు రీయింబ్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్​ చేశారు. బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం మాసబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యా మండలిని ముట్టడించి, ధర్నా నిర్వహించారు.

ఈ నిరసనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని రోడ్డుపై బైఠాయించారు.  అలాగే,  బీఆర్​ఎస్వీ నగర ఇన్​చార్జి విశాల్,  ఆలిండియా డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్  రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్  ఆధ్వర్యంలో  వేర్వేరుగా హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ​ఎదుట ఆందోళన చేపట్టారు. 

బషీర్​బాగ్ : ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం నిజాం కాలేజీ విద్యార్థులు బషీర్ బాగ్ లో ఆందోళనకు దిగారు. ఏబీవీపీ గోల్కొండ జిల్లా కన్వీనర్ విక్రమాదిత్య ఆధ్వర్యంలో నిజాం కళాశాల నుంచి బషీర్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్​బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు 
 ర్యాలీ చేపట్టారు.