జోరుగా మహారాష్ట్ర మున్నిపల్ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన పలువురు ప్రముఖులు

జోరుగా మహారాష్ట్ర మున్నిపల్ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన పలువురు ప్రముఖులు

 ముంబై: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. గురువారం (జనవరి 15) ఉదయం 7.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పోలింగ్ బూత్‎లకు కదిలారు. క్యూ లైన్లలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సామాన్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఓటు వేసేందుకు తరలివచ్చారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, యాక్టర్లు సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, తమన్నా, సాన్య మల్హోత్రా, హేమ మాలిని, నానా పటేకర్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ALSO READ : నిరసనకారుల ఉరికి ఖమేనీ సర్కార్ బ్రేక్..

 ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని  ఏర్పాట్లు చేశారు. కొన్నింటిని మోడల్​పోలింగ్ స్టేషన్లుగా తీర్చిదిద్దారు. రాష్ట్రవ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఉత్సాహంగా ఓటేసేందుకు తరలివచ్చారు. మరోవైపు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఓటు వేసేందుకు తరలి రానుండటంతో భద్రతను కట్టదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. 

ALSO READ : డిఫెక్ట్ ఉన్న వస్తువులు అమ్మితే బాధ్యత మీదే..

సాయంత్రం 5.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రేపు (జనవరి 16) ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు అధికారులు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 29 మున్సిపల్‌ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 15,931 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 3.48 కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 29 మున్సిపల్‌ కార్పొరేషన్లలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.