
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రక టించిన గ్రూప్1 నోటిఫికేషన్‌తో నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. మొత్తం 1,600 పోస్టులు ఖాళీగా ఉంటే, 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారని.. ఈ విషయంలో రాష్ట్ర సర్కార్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.
మం గళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడి యాతో ఆయన మాట్లాడారు. కొత్త జిల్లాలు, మండలాలు, మున్సిపాలిటీలు ఏర్పడ్డాక అడ్మి నిస్ట్రేషన్ పెరిగిందన్నారు. అందుకే ఐఏఎస్, ఉన్నతాధికారులో సమీక్ష నిర్వహించి పెరి గిన ఉద్యోగాలను గుర్తించి, వాటిని భర్తీ చే యాలని డిమాండ్ చేశారు. 40 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, అప్పుడే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు.