25 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్​ ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య

25 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్​ ఇవ్వాలి : ఆర్.కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 25 వేల ​పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి ఉద్యోగాల భర్తీపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని కోరారు. ప్రతి స్కూలులో సబ్జెక్టుకు ఒక టీచర్​ఉండేలా చూడాలన్నారు. 

లేనిపక్షంలో 10,000 మంది నిరుద్యోగులు, స్టూడెంట్లతో కలిసి ధర్నా చౌక్ లో నిరసనకు దిగుతామని హెచ్చరించారు. మంగళవారం విద్యానగర్ బీసీ భవన్ లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ అధ్యక్షతన బీసీ, విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం స్కూళ్లలో సరిపడా టీచర్లు లేకుండా చేసిందని, కాంగ్రెస్​ప్రభుత్వమైనా పట్టించుకోవాలని కోరారు.