తప్పుడు ప్రశ్నలతో కానిస్టేబుల్ అభ్యర్థులకు నష్టం: ఆర్ కృష్ణయ్య

తప్పుడు ప్రశ్నలతో కానిస్టేబుల్ అభ్యర్థులకు నష్టం: ఆర్ కృష్ణయ్య

కానిస్టేబుల్ పరీక్షలలో 22 తప్పుడు ప్రశ్నలు ఇచ్చినందుకు చాలా మంది విద్యార్థులు క్వాలిఫై కాలేకపోయారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల పరీక్షా విధానంలో తమకు నష్టం వాటిల్లిందంటూ విద్యార్థులు విద్యానగర్ లోని బీసీ భవన్ లో ఆర్ కృష్ణయ్యను కలిశారు. తమకు న్యాయం చేయాలని ఎన్సీసీ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య, బీసీ సంఘం నాయకుడు నీల వెంకటేష్ మాట్లాడారు. 

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో తప్పుడు ప్రశ్నలు రావడం వల్ల వేలాది మంది అభ్యర్థులు నష్టపోయారని ఆర్ కృష్ణయ్య అన్నారు. దీంతో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. అంతే కాకుండా EWC కి 10 శాతం రిజర్వేషన్ కల్పించి వారికి ఆ రిజర్వేషన్ మార్కులు కూడా కల్పకపోవడం చాలా బాధాకరం అన్నారు. కాబట్టి కానిస్టేబుల్ అభ్యర్థులకు 22 మార్కులు, ఎస్సై అభ్యర్థులకు 2 మార్కులు కలపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అన్ని ప్రజా సంఘాలతో, విద్యార్థులతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.