కేసులు ఎత్తివేయకపోతే జైల్భరో నిర్వహిస్తం : ఆర్.కృష్ణయ్య

కేసులు ఎత్తివేయకపోతే జైల్భరో నిర్వహిస్తం : ఆర్.కృష్ణయ్య
  • ఎంపీ, బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

బషీర్​బాగ్, వెలుగు: ఇటీవల బంద్ సందర్భంగా బీసీ లీడర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయపోతే జైల్ భరో చేపడతామని  ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్​ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలను శాసించే స్థాయికి బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తామని, బీసీల రిజర్వేషన్​అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. 

స్థానిక సంస్థలతో పాటు , చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లను సాధించడమే అంతిమ లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.  గ్రామ స్థాయి నుంచి ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం లీడర్లు గుజ్జసత్యం, శంకర్ ముదిరాజ్,  విజయ్ కుమార్, కొండ దేవయ్య, రాజేందర్ పాల్గొన్నారు