‘వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు’కు ఎంపికవడం నా అదృష్టం : నారాయణ మూర్తి

‘వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు’కు ఎంపికవడం నా అదృష్టం : నారాయణ మూర్తి

‘వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు’ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ లకు పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి  కృతజ్ఞతలు తెలిపారు. కళారంగంలో కళా తపస్వి కె. విశ్వనాథ్ తో పాటు తనకు ఏపీ ప్రభుత్వం అవార్డు ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు వెల్లడించారు. గత 38 ఎనిమిదేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, భారత దేశంలో ఉత్పన్నమవుతున్న ప్రజా సమస్యలపై స్పందించి వాటి ఇతివృత్తంతో సినిమాలు తీస్తూ వస్తున్నట్లు తెలిపారు.

‘అర్ధరాత్రి స్వతంత్రం’ నుంచి ‘నేటి యూనివర్సిటీ’ వరకు సినిమాల వల్ల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నానన్నారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డులను సీఎం జగన్ ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద ఎంపికైన వారికి రూ.10 లక్షలు, వైఎస్సార్‌ కాంస్య విగ్రహం, జ్ఞాపిక,  ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఇక వైఎస్సార్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు కింద ఎంపికైన వారికి రూ.5 లక్షలు, జ్ఞాపిక,  ప్రశంసాపత్రాన్ని ఇస్తారు.