గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సెప్టెంబర్ 30న రిలీజైన 'రా మచ్చా మచ్చా' (Raa Macha Macha) సాంగ్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా తెరకెక్కిన.. ఈ సాంగ్ లో ఇంటెన్స్ డ్యాన్స్ వైబ్స్తో చరణ్ దుమ్ములేపేశాడు. గ్రేస్‌తో చెర్రీ వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది.
తమన్ ఈ సారి మచ్చా అంటూ బాక్సులు పగిలిపోయేలా ఇచ్చిన సౌండ్ ట్రాక్ కు రామ్ చరణ్ ఇచ్చిపడేశారు. రచయిత అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటను..నకాష్ అజీజ్ పాడారు. స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేయడం మరో విశేషం. ఎంతో కలర్ ఫుల్గా, గ్రాండియర్ గా ఉన్న ఈ పాటలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే, ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటూ మేకర్స్ చెప్పుకొచ్చారు. అవేంటో ఓసారి లుక్కేద్దాం.
ఈ పాటలో ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఇందులో భాగమవటం విశేషంగా ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతులను బేస్ చేసుకుని ఈ పాటను శంకర్ వినూత్నంగా రూపొందించారు.
ఏపీలోని విభిన్నమైన నృత్య రీతులలో ఎంతో గుర్తింపు పొందిన 'గుసాడి, కొమ్ము కోయ, తప్పెట గుళ్లు' వంటి జానపద నృత్యాలతో పాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రానప్ప, పైకా, దురువ వంటి వాటితో పాటు కర్ణాటకు చెందిన హలారి, ఒక్కలిగ, గొరవర, కుణిత వంటి నృత్య రీతులను కూడా ఈ సాంగ్‌లో మమేకం చేశారంటూ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో మేకర్స్ చెప్పుకొచ్చారు.
ఇక మొత్తంగా చరణ్ ఫ్యాన్స్కి ఇచ్చిన ఈ గిఫ్ట్ మెగా అభిమానుల్లో ఖుష నింపింది. ఇపుడీ రా మచ్చా మచ్చా సాంగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికి వస్తే క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న రిలీజ్ ఉండనుందని టాక్.