నవ్వుల రాశి

నవ్వుల రాశి

వరుస ప్రాజెక్టులతో మంచి జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీదుంది రాశీఖన్నా. త్వరలో మారుతి డైరెక్ట్ చేసిన ‘పక్కా కమర్షియల్’ మూవీతో ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేయబోతోంది. గోపీచంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె పాత్ర చాలా స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందంటున్నారు మేకర్స్. ఈ మూవీలో రాశి సీరియల్ యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించిందట. చాలా ఫన్నీ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని, చూసినవారికి కడుపు చెక్కలవ్వడం ఖాయమని అంటున్నారు. ‘ప్రతిరోజు పండగే’లో కూడా ఆమెకి చాలా ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనింగ్ పాత్రని ఇచ్చారు మారుతి. దానికి నూరు శాతం న్యాయం చేసింది రాశి. మరి ఈసారి ఇంకెంత వినోదాన్ని పంచబోతోందో చూడాలి. ఇదిలా ఉంచితే రాశి గురించి ఓ కొత్త విషయం తెలిసింది. లారెన్స్ హీరోగా పి.వాసు డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందనున్న ‘చంద్రముఖి 2’లో ఆమెని హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నారట. రజినీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా వచ్చిన మొదటి పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కూడా ప్రెస్టీజియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే ప్లాన్ చేశారు. ఇలాంటి సినిమాలో చాన్స్ రావడం రాశికి కలిసొచ్చే అంశమే. ఆ మధ్య ‘చంద్రకళ’ సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ యాక్ట్ చేసింది రాశి. ఈ వార్త నిజమైతే మరోసారి హారర్ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించబోతోందామె. ఇక బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ బిజీగా ఉంది. అజయ్ దేవగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె నటించిన ‘రుద్ర’ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే తనకి మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కలిసి మరో సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటి స్తోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీబిజీగా గడిపేస్తోంది రాశి.