ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త 

V6 Velugu Posted on Oct 13, 2021

హైదరాబాద్: దసరా పండుగకు ఊరేళ్లేవారు ఇల్లు జాగ్రత్త అని సూచించారు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్. తాళం వేసిన ఇల్లనే దొంగలు టార్గెట్ చేసే అవకాశాలున్నాయని..ఊరెళ్లేవారు పక్కింటివారికి చెప్పి కాస్త గమనించమని చెప్పాలన్నారు. అనుమానిత వ్యక్తులపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు దొంగతనాలకు పాల్పడుతారని.. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచకుండా ఉంటే మంచిదన్నారు. వీలైతే బంగారం, క్యాష్ ఇంట్లో పెట్టకుండా బ్యాంక్ లాకార్లలో ఉంచుకోవాలని సూచించారు. ఇంట్లో ఉన్న సీక్రెట్ కెమెరా ఉన్నవారు వాటిని పనిచేసే విధంగా చెక్ చేసుకోవాలన్నారు. ఎలాంటి అనుమానాలు వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ మహేష్ భగవత్ సూచించారు. 

Tagged HOME, Festival, Mahesh bhagwat, Careful,

Latest Videos

Subscribe Now

More News