మల్కాజిగిరి బోనాల్లో భక్తులకు ఇబ్బంది రావొద్దు : రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్​

మల్కాజిగిరి బోనాల్లో భక్తులకు ఇబ్బంది రావొద్దు : రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్​
  • రాచకొండ సీపీ  డీఎస్ చౌహాన్​

మల్కాజిగిరి, వెలుగు: ఈ నెల 16,17 తేదీల్లో మల్కాజిగిరిలో జరగనున్న మహంకాళి బోనాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఓల్డ్ మల్కాజిగిరిలోని మహంకాళి దేవాలయం, సఫిల్ గూడ కట్టమైసమ్మ టెంపుల్​ను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బోనాలకు వచ్చే మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిఘా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ జానకి, ఏసీపీ నరేశ్ రెడ్డి, ఏసీపీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

రెండ్రోజులు వైన్స్ బంద్

బోనాల సందర్భంగా ఎల్​బీనగర్, మల్కాజిగిరి, మహేశ్వరం జోన్ పరిధిలో ఈ నెల 16న ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. రెండ్రోజుల పాటు  వైన్స్, బార్​లను మూసివేయాలన్నారు. లిక్కర్ అమ్మితే సీరియస్​ యాక్షన్​ తీసుకుంటామని హెచ్చరించారు.