ఓనర్ ఏటీఎం కార్డ్ కొట్టేసి..బెంగళూరులో జల్సాలు

ఓనర్ ఏటీఎం కార్డ్ కొట్టేసి..బెంగళూరులో జల్సాలు

యజమాని ఏటీఎం కార్డు ఎత్తుకెళ్లి లక్షలు డ్రా చేసి జల్సాలు చేసిన వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రకాశం జిల్లా మంగమూర్ మండలం నూతనా పాడుకు చెందిన తన్నిరు లక్ష్మీనారాయణ వనస్థలిపురంలో నివాసం ఉండే మహిళ ఇంట్లో కుక్ గా పనిచేసేవాడు. ఇంట్లో పనిచేస్తున్నప్పుడు బాధితురాలి సోదరి అమెరికాలో ఉంటుంది. అమెరికాలో ఉండే సోదరి వనస్థలిపురంలో ఉండే సోదరికి తరచూ  డబ్బులు పంపేది . ఈ క్రమంలో మహిళ తన ఏటీఎం కార్డుపై పిన్ నెంబర్ రాసి టేబుల్ పై పెట్టేది. ఇది గమనించిన లక్ష్మినారాయణ ఏటీఎం కార్డును తీసి పలు చోట్ల రూ. 2.70 లక్షల నగదునువిత్ డ్రా చేశాడు. బాధితురాలు ఫోన్ పనిచేయకపోవడంతో బ్యాంకు నుండి వచ్చే మెసేజ్ లు వెళ్లలేదు.  గతేడాది డిసెంబర్ లో అమెరికా నుంచి వచ్చిన బాధితుల సోదరి బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేయగా బ్యాంక్ ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేసినట్లు తెలింది. అయితే అప్పటికే లక్ష్మినారాయణ బాధితుల ఇంట్లో పనిచేయడం మానేసి బెంగళూరు వెళ్లి అక్కడ జల్సా చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదుతో  ఈ మేరకు బాధితుల ఫిర్యాదుతో  లక్ష్మీనారాయణను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.